‘కొలువుల కొట్లాట’ను ఉధృతం చేస్తాం

10 Dec, 2017 02:49 IST|Sakshi

కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన టీజేఏసీ 

సాక్షి, హైదరాబాద్‌: కొలువుల కొట్లాట ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని టీజేఏసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను వెల్లడించింది. టీజే ఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ అధ్యక్షతన కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ టీజేఏసీ జిల్లా స్థాయి నేతలతో ఈ నెల 17న వర్క్‌షాప్‌ నిర్వహిస్తామని, రైతాంగ సమస్యలపై జిల్లా స్థాయిలో రెండు వారాల పాటు అధ్యయన యాత్రలు చేస్తామని ప్రకటించారు. 22, 23 తేదీల్లో నల్లగొండ జిల్లాలో స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తామని చెప్పారు.

జనవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి సదస్సు జరిపి డిమాండ్లు ప్రకటిస్తామన్నారు. జనవరి, ఫిబ్రవరిలో మండల స్థాయి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని, ఫిబ్రవరి చివరలో హైదరాబాద్‌లో భారీ ఆందోళన కార్య క్రమం చేపడతామని తెలిపారు.  జిల్లా స్థాయి సదస్సులు నిర్వహిస్తామని, సంతకాల సేకరణ జరుపుతామని, నిరుద్యోగ సమస్యల తీవ్రతను ఉత్తరాల ద్వారా గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులకు తెలియజేస్తామని పేర్కొ న్నారు. కొలువుల కొట్లాటతో పాటు రైతుల సమస్యల పైనా ఉద్యమిస్తామని తెలిపారు. నిర్మాణ రంగ, మహిళా, రైతు, ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి, టీఎస్‌ఐపాస్‌ అధ్యయనానికి సబ్‌ కమిటీలను ఏర్పాటుచేయనున్నట్లు కోదండరామ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు