ఎస్పీ మాటల్లో తప్పేముంది? : డిప్యూటీ సీఎం

29 Dec, 2019 13:27 IST|Sakshi

లక్నో : భారత్‌లో ఉండడం​ ఇష్టం లేకపోతే పాకిస్తాన్‌ వెళ్లిపోండి అని అ‍న్న మీరట్‌ ఎస్పీ మాటల్లో తప్పేముందని ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య తిరిగి ప్రశ్నించారు. ఆ మాటలు మొత్తం ముస్లిం సమాజానికి వర్తించవని, కేవలం పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన వారికే వర్తిస్తాయని, విమర్శించేవారు ఇది గమనించాలని కోరారు. మౌర్య ఆదివారం ఓ మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో కొందరు పోలీసులపై రాళ్లు విసురుతూ పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు చేశారు. వారినుద్దేశించి మాత్రమే ఎస్పీ ఆ మాటలన్నారు. ఇందులో తప్పేముందో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. కాగా, ఇంతకు ముందు కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ స్పందిస్తూ ఎస్పీ వ్యాఖ్యలు నిజమైతే ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండివాళ్లను పాకిస్తాన్‌ వెళ్లిపొమ్మని చెప్పండి : మీరట్‌ ఎస్పీ

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు