‘పెద్దల’పై ఆప్‌లో తర్జన భర్జన..

2 Jan, 2018 16:44 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ అభ్యర్థులపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాజ్యసభకు పంపాల్సిన ముగ్గురు సభ్యుల ఎంపిక పై ఆప్‌ తర్జన భర్జన పడుతుంది. పార్టీ సీనియర్ నేతలు కుమార్ విశ్వాస్, అశుతోష్ కు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతుండగా.. అనూహ్యంగా కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి వచ్చాయి. సంజయ్ సింగ్, సుశీల్ గుప్తా, ఎన్‌డీ గుప్తాలను ఆప్ పెద్దల సభకు పంపనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

వీరిలో సంజయ్ సింగ్ మినహా మిగిలిన ఇద్దరూ ఆప్ సర్కిల్ లో పెద్దగా పరిచయంలేని వ్యక్తులే. సుశీల్ గుప్తా వ్యాపారవేత్త కాగా, ఎన్డీ గుప్తా చార్టర్డ్ ఎకౌంటెంట్. జనవరి 16న రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా.. జనవరి 5తో నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ.

ఢిల్లీ నుంచి ముగ్గురు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండగా.. 67మంది ఎమ్మెల్యేలున్న ఆమ్ ఆద్మీకి గెలుపు నల్లేరు మీద నడకే. బుధవారం ఆప్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమై అభ్యర్థులను ఖరారు చేయనుంది.

మరిన్ని వార్తలు