కనీస ఉమ్మడి ప్రణాళికపై కసరత్తు

13 Nov, 2018 01:26 IST|Sakshi

భట్టి నివాసంలో కోదండరాం, ఎల్‌.రమణ, గద్దర్‌ల భేటీ

సాక్షి, హైదరాబాద్‌: సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వస్తున్న సమయంలో కూటమి నేతలు కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)పై తుది కసరత్తు ప్రారం భించారు. సోమవారం కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క నివాసంలో కూటమి నేతలు భేటీ అయ్యారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, టీజేఎస్‌ అధినేత కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్‌లు భట్టి ఆహ్వానం మేరకు అల్పాహార విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమి పక్షాన ప్రజల ముందుంచాల్సిన సీఎంపీపై చర్చించారు. ‘పీపుల్స్‌ ఎజెండా’ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. సీఎంపీకి సంబంధించిన తుది ప్రతిపాదనలను టీడీపీ, టీజేఎస్‌ నేతలు భట్టికి అందజేశారు. దీనిపై భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకత్వం, కూటమి నాయకుల సమక్షంలో చర్చించి ఎజెండాను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు.

మరిన్ని వార్తలు