ఆదినారాయణరెడ్డి నువ్వెప్పుడు రాజీనామా చేశావ్‌?

25 Oct, 2017 12:56 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీ మంత్రులు నారా లోకేశ్‌, ఆదినారాయణరెడ్డి, ప‍్రత్తిపాటి పుల్లారావులపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌  పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రపై మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో  జోగి రమేష్‌ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఆదినారాయణరెడ్డి  తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ప్రబుద్ధుడు. ఆదినారాయణరెడ్డి నువ్వెప్పుడు రాజీనామా చేశావు. ఆ రాజీనామా లేఖను స్పీకర్‌కు  ఎప్పుడిచ్చావ్‌. మరి స్పీకర్‌ ఎందుకు ఆమోదించలేదు?. ఆదినారాయణరెడ్డి నీకు దమ్ము, ధైర్యముంటే రాజీనామా ఆమోదింపచేసుకుని ఎన్నికలకు రావాలి.

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తే మీకు భయమెందుకు?. 420 అనగానే ఏపీలో గుర్తుకొచ్చేది చంద్రబాబే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అని తప్పులు లేకుండా పలకగలవా లోకేశ్‌. అఆలు, ఏబీసీడీలు రాని లోకేశ్‌ కూడా జగన్‌ను విమర్శించడమా?, మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలి. మంత్రి దేవినే ఉమకు బహిరంగ లేఖ రాస్తున్నా. నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి. టైమ్‌, డేట్‌, ప్లేస్‌ చెబితే నేను చర్చకు సిద్ధం. 24 గంటల్లో స్పందించకపోతే నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేఖను ఇరిగేషన్‌ కార్యాలయానికి, మీ ఇంటికి పంపుతున్నా.’ అని పేర్కొన్నారు. కాగా పార్టీ మారిన 21మంది ఎమ్మెల్యేలంతా అప్పుడే తమ రాజీనామా లేఖల్ని స్పీకర్‌కు అందచేశామని, వాటిపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు