'మేమిచ్చిన ఉత్తమ కానుక ఇదేనేమో'

28 Dec, 2019 16:02 IST|Sakshi

ప్రపంచంలో ఎక్కడైనా భార్యభర్తల మధ్య ఉండే అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందనేది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఆ వీడియోలో ఒక బామ్మకు ఆమె కుటుంబసభ్యులు ఒక గిఫ్ట్‌బాక్స్‌ను కానుకగా ఇచ్చారు. ఆమె బాక్స్‌ను ఓపెన్‌ చేసిన తర్వాత ఒక్కసారిగా బావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ ఆ బాక్స్‌లో ఉన్నవి ఏంటో తెలుసా.. తన భర్త ఆమెకు రాసిన ప్రేమ ఉత్తరాలు. అందుకే మనల్ని ప్రేమించేవారు దూరమైనా మనకంటూ కొన్ని జ్ఞాపకాలను విడిచి వెళ్లిపోతారని ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. 

'మా తాతయ్య చనిపోయి 7నెలలు అవుతుంది. అయితే తాతయ్య లేకుండా మొదటిసారి నానమ్మ జరుపుకుంటున్న క్రిస్‌మస్‌ పండుగ కావడంతో తనకు ఏదైనా మరిచిపోలేని కానుకను ఇవ్వాలనుకున్నా. మా నానమ్మ, తాతయ్యలది ప్రేమవివాహం. కాగా మా తాతయ్య 1962లో వారి కాలేజ్‌ డేస్‌లో నానమ్మకు రాసిన ప్రేమలేఖలు మాకు దొరికాయి. కానీ ఆ ప్రేమలేఖలను మా తాతయ్య చనిపోయేవరకు తన దగ్గరే భద్రపరచుకున్నారు. వీటిని ఒక కానుక రూపంలో మా నానమ్మకు అందజేయగానే ఆమె బావోద్వేగానికి గురవడం నేను చూశాను. దీంతో నానమ్మకు నేనిచ్చిన ఉత్తమ కానుక ఇదే కావొచ్చు' అంటూ ట్వీట్‌ చేసింది. 

ఈ వీడియోనూ కాస్తా ఆమె తన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే 16 మిలియన్ల మంది వీక్షించారు. 'నేను చూసిన వీడియోల్లో ఇది నా హృదయాన్ని కదిలించింది' అంటూ ఒకరు ట్వీట్‌ చేశారు. 'మీ నానమ్మ ఎప్పుడూ ఇంతే సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నట్లు పలువురు కామెంట్లు పెట్టారు. 

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా