‘ఈ దివాళి వారి జీవితాల్లోనూ వెలుగులు నింపాలి’

5 Nov, 2018 20:52 IST|Sakshi

మాల్స్‌ వచ్చిన దగ్గర నుంచి వీధి చివర దుకాణాలకు.. రోడ్ల వెంబడి వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందనే చెప్పవచ్చు. విదేశీ సంస్కృతి మీద మోజుతో స్వదేశీయులకు తీవ్ర నష్టం కల్గిస్తున్నాము. మాల్స్‌లో వేలకు వేలు ఖర్చు చేసే జనాలు.. చిరు వ్యాపారస్తుల దగ్గర కొనేటప్పుడు మాత్రం గీసిగీసి బెరమాడతారు. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులకిచ్చే పది, ఇరవై రూపాయల దగ్గర వంద సార్లు ఆలోచిస్తుంటాం. ఈ సంస్కృతి మారి.. చిరువ్యాపారులకు సాయం చేసినప్పుడే.. వారి వ్యాపారాలు కలకలలాడినప్పుడే నిజమైన దీపావళి అనే  ఉద్దేశంతో చేసిన ఓ యాడ్‌ ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

ప్రముఖ కంప్యూటర్లు, ప్రింటర్ల మేకింగ్‌ కంపెనీ హెచ్‌పీ ఇండియా ‘వీధి వ్యాపారస్తులకు మద్దతు తెలపండి.. మన ఇళ్లలోని దీపాలు వారి ఇళ్లలో కూడా కాంతులు నింపుతాయి’ అనే ఉద్దేశంతో ఓ యాడ్‌ను రూపొందించింది. తొమ్మిదేళ్ల బాలుడు వీధుల్లో ప్రమిదలు అమ్ముకునే ఓ మహిళ ముఖంలో దివాళి ఆనందం ఎలా తీసుకు వచ్చాడనే ఇతివృత్తంతో రూపొందించిన ఈ వీడియోను హెచ్‌పీ ఇండియా తన ట్విట్టర్ అకౌంట్‌లో 'ఉమ్మీద్ కా దియా' పేరిట పోస్ట్‌ చేసింది. ఇలా షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడయోను దాదాపు 2.3 మిలియన్ల మంది చూశారు.

>
మరిన్ని వార్తలు