కోహ్లి కంటే 9 రెట్లు ఎక్కువ!

27 Jul, 2018 10:44 IST|Sakshi
కైలీ జెన్నర్‌ ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌

ముంబై : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా రూ.82 లక్షలు సంపాదిస్తున్నాడని తెలిసి నోరెళ్లబెట్టాం.. కానీ అదే ఒక్క పోస్టుకు కోహ్లి కన్నా 9 రెట్లు ఎక్కువ సంపాదిస్తోంది ఓ ప్రముఖ మోడల్‌. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అత్యధికంగా ఆర్జిస్తోన్న వారి జాబితాను ఇటీవల హోపర్స్‌ హెచ్‌క్యూ సంస్థ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో అత్యధికంగా ఆర్జించి తొలి స్థానం దక్కించుకుంది.. రియాల్టీ టీవీ స్టార్‌, ప్రముఖ అమెరికన్‌ మోడల్‌ కైలీ జెన్నర్‌.

ఆమె ఒక్క వాణిజ్య ప్రకటనకు సంబంధించిన పోస్ట్‌కు ఏకంగా 1 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు(6 కోట్ల 85 లక్షల,42 వేల రూపాయలు) ఆర్జిస్తోంది. ఆమె తర్వాత ప్రముఖ నటి, సింగర్‌ సెలెన గోమేజ్‌ 5 కోట్ల 48 లక్షల రూపాయలతో రెండో స్థానంలో నిలిచింది. గత ఫిబ్రవరిలో కైలీజెన్నర్‌ ఒక్క ట్వీట్‌తో స్నాప్‌ చాట్‌ కొంపముంచింది. ఆమె చేసిన ఒక్క ట్వీట్‌తో స్నాప్‌ చాట్‌ సుమారు 7 వేల కోట్లు నష్టపోయిందంటే.. ఆమెకు ఏ రేంజ్‌లో ఫాలోవర్స్‌ ఉన్నారో అర్థమవుతోంది. ఈ అమెరికా మోడల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 111.9 మిలియన్స్‌ మంది ఫాలో అవుతుండటం విశేషం. ఇక క్రీడాకారుల జాబితాలో 9వ స్థానంలో నిలిచిన కోహ్లి... ఓవరాల్‌గా 17వ స్థానంలో ఉన్నాడు.

thanks @voguemagazine ✨

A post shared by Kylie (@kyliejenner) on

చదవండి: ఒక్క ట్వీట్‌తో 7వేల కోట్లకు ముంచేసింది

కోహ్లి పోస్టుకు రూ. 82 లక్షలు

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హవ్వా.. అనుష్కా లెజెండా?

పంచాయతీ ఎన్నికలు.. ‘సోషల్‌’ పోరు మొదలైంది

‘స్టుపిడ్‌.. బుద్ధి లేదా.. అదేం పని?’

బాబు నోట భలే మాట!

వావ్‌.. బాటిల్‌ని ఇలా కూడా వాడొచ్చా?!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అప్పుడు చాలా బాధనిపించింది’

తల్లికి తగ్గ తనయ

డేట్‌ ఫైనల్‌

నన్ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు

ఇస్మార్ట్‌ గాళ్‌ ఇన్‌?

కనుక్కోండి చూద్దాం