ఆసీస్కు భారీ ఆధిక్యం

28 Dec, 2015 14:52 IST|Sakshi
ఆసీస్కు భారీ ఆధిక్యం

మెల్ బోర్న్:వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయడంతో ఓవరాల్ గా 459 పరుగుల ఆధిక్యం సాధించింది.  ఆసీస్ ఓపెనర్లు  బర్న్స్(4), డేవిడ్ వార్నర్(17) లు ఆదిలోనే పెవిలియన్ కు చేరి నిరాశపరిచినా..  కెప్టెన్ స్టీవ్ స్మిత్ (70 బ్యాటింగ్) , ఉస్మాన్ ఖవాజా (56)లు మరోసారి రాణించారు.  స్మిత్ కు జతగా మిచెల్ మార్ష్(18 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు.

 

అంతకుముందు 91/6 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 271 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. విండీస్ ఆటగాళ్లలో డారెన్ బ్రేవో(81), కార్లోస్ బ్రాత్ వైట్(59) రాణించి కష్టాల్లో పడ్డ జట్టును గట్టెక్కించారు. ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్ లోఆసీస్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

 

ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 551/3 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ 179/3

విండీస్ తొలి ఇన్నింగ్స్ 271 ఆలౌట్

మరిన్ని వార్తలు