ధోని గడ్డపై ఆసీస్‌ రికార్డు

8 Mar, 2019 18:07 IST|Sakshi

రాంచీ: భారత్‌తో ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా రికార్డు నమోదు చేసింది. రాంచీలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఆసీస్‌ చరిత్ర సృష్టించింది. తాజా వన్డేలో ఆసీస్‌ ఐదు వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేయడం ద్వారా అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలోనే  ఇక్కడ తమ పేరిటే ఉన్న అత్యధిక పరుగుల రికార్డును ఆసీస్‌ సవరించింది. 2013లో ఆసీస్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఇదే ధోని సొంత మైదానంలో అత్యధిక స్కోరుగా ఉంది. ఆ రికార్డును ఆసీస్‌ బ్రేక్‌ చేయడమే కాకుండా మూడొందలకు పైగా స్కోరు సాధించిన తొలి జట్టుగా గుర్తింపు సాధించింది.
(ఇక్కడ చదవండి: ఖాజా సెంచరీ.. ఆసీస్‌ భారీ స్కోరు)

మరొకవైపు చివరి పది ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ 69 పరుగులు చేసింది. 2017 నుంచి చూస్తే భారత్‌లో చివరి పది ఓవర్లలో ఆసీస్‌కు ఇది రెండో అత్యుత్తమం కావడం మరో విశేషం.  అయితే గతంలో బెంగళూరులో ఆసీస్‌ చివరి పది ఓవర్లలో సాధించిన పరుగులు 86. ఇది ఆసీస్‌కు భారత్‌లో ఆఖరి పది ఓవర్ల అత్యుత్తమంగా ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో ఆసీస్‌ చివరి పది ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 63 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

(ఇక్కడ చదవండి: ధావన్‌ వదిలేశాడు..!)

ఆసీస్‌కు ఇది మూడోది..

>
మరిన్ని వార్తలు