మరో ఆసీస్ మహిళా క్రికెటర్ పై నిషేధం

5 Feb, 2016 00:32 IST|Sakshi
మరో ఆసీస్ మహిళా క్రికెటర్ పై నిషేధం

బెట్టింగ్‌కు పాల్పడినందుకు శిక్ష
సిడ్నీ: బెట్టింగ్‌కు పాల్పడినందుకు ఆస్ట్రేలియాకు చెందిన మరో మహిళా క్రికెటర్ నిషేధానికి గురైంది. బిగ్‌బాష్ టి20 లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 19 ఏళ్లీ పీపా క్లీరీపై ఆరు నెలల నిషేధం విధిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పురుషుల జట్ల మధ్య అడిలైడ్‌లో జరిగిన డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌పై క్లీరీ 15.5 ఆస్ట్రేలియన్ డాలర్ల (దాదాపు రూ. 758) అతి స్వల్ప మొత్తానికి పందెం కాసింది. బోర్డుతో కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్లు బెట్టింగ్‌కు పాల్పడటం నిబంధనలకు విరుద్ధం. బెట్టింగ్ విషయంలో క్రికెటర్లకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తరహా వ్యవహారాలను సహించబోమని సీఏ అవినీతి వ్యతిరేక విభాగం అధికారి ఇయాన్ రాయ్ స్పష్టం చేశారు. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్‌పై బెట్టింగ్ కాసి పట్టుబడిన ఆస్ట్రేలియాకు చెందిన మరో మహిళా క్రికెటర్ ఏంజెలా రీక్స్ కూడా ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటోంది.

మరిన్ని వార్తలు