పంజాబ్ లక్ష్యం 227

6 May, 2015 22:20 IST|Sakshi
పంజాబ్ లక్ష్యం 227

బెంగళూరు: ఐపీఎల్ -8లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. దాంతో పంజాబ్ జట్టుకు 227పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత ఓపెనర్లుగా దిగిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ, గేల్ మ్యాచ్కు శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరి భాగస్వామ్యంతో ఆది నుంచి దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

ఇంతలో 119 పరుగుల వద్ద ఓపెనర్ కోహ్లీ(32) తొలి వికెట్ కోల్పోయింది. సందీప్ శర్మ ఓవర్లో కోహ్లీని పెవిలియన్కు పంపాడు. అయినా గేల్ దూకుడు తగ్గలేదు. తనదైన శైలీలో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూ చెలరేగిపోయాడు. 146 పరుగుల వద్ద బెంగళూరు ఆటగాడు గేల్ సెంచరీ చేసి రికార్డ్ నెలకొల్పాడు. గేల్ అద్భుత ప్రదర్శనతో బెంగళూరు జట్టులోనూ, ప్రేక్షకుల్లోనూ నూతన ఉత్సాహం ఊరకేలిసింది. పంజాబ్ బౌలర్లు విసిరే బంతులను వచ్చింది తడవు సిక్స్లు, బౌండరీలు దాటించాడు. కానీ 190 పరుగుల వద్ద పటేల్ బౌలింగ్లో గేల్ దూకుడుకు కళ్లెం పడింది. దాంతో గేల్ వన్ మ్యాన్ 'షో' కు బ్రేక్ పడింది.  దాంతో 57 బంతుల్లో 12 సిక్సర్లు, 7ఫోర్ల 117 పరుగులు చేసిన గేల్ పెవిలియన్కు చేరాడు. ఆ తరువాత వచ్చిన ఆటగాళ్లు కార్తీక్ (8) ఔట్ కాగా, సర్ఫరాజ్ ఖాన్ (11), డివిలియర్స్ (47) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. పంజాబ్ బౌలర్లు సందీప్ శర్మ రెండు వికెట్లు, పటేల్ ఒక వికెట్ తీసుకున్నారు.

మరిన్ని వార్తలు