టీమిండియా చీఫ్ కోచ్గా ద్రావిడ్?

3 Apr, 2016 10:31 IST|Sakshi
టీమిండియా చీఫ్ కోచ్గా ద్రావిడ్?

ముంబై: టీమిండియా చీఫ్ కోచ్  పదవికి మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ పేరు వినిపిస్తోంది. ద్రావిడ్ను చీఫ్ కోచ్గా నియమించాలని బోర్డు భావిస్తున్నట్టు సమాచారం. సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్లతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ ఈ మేరకు ద్రావిడ్ను సంప్రదించినట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి. కాగా ఈ విషయంపై ద్రావిడ్ కానీ అడ్వైజరీ కమిటీ సభ్యులు కానీ స్పందించలేదు.

ద్రావిడ్ ప్రస్తుతం భారత్-ఎ, అండర్-19 జట్లకు చీఫ్ కోచ్గా ఉన్నాడు. టెస్టు క్రికెట్ను దృష్టిలో పెట్టుకుని ప్రతిభావంతులైన యువ బ్యాట్స్మెన్ను ప్రోత్సహించేందుకు సమర్థుడైన వ్యక్తికి చీఫ్‌ కోచ్ బాధ్యతలు అప్పగించాలని బోర్డు భావిస్తోంది. ఇందుకు ద్రావిడ్ అప్పగిస్తే, అతనికి పూర్తి స్వేచ్ఛనివ్వడంతో పాటు దీర్ఘకాలిక కాంట్రాక్టు ఇవ్వవచ్చని బోర్డు వర్గాలు వెల్లడించాయి. అంటే 2019 ప్రపంచ కప్ వరకు చీఫ్ కోచ్గా నియమించవచ్చు. టీమిండియా డైరెక్టర్గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి పదవీకాలం టి-20 ప్రపంచ కప్తో ముగిసింది.
 

మరిన్ని వార్తలు