ఔరా.. ఏం క్యాచ్‌ అది!

19 Jan, 2019 14:47 IST|Sakshi

సిడ్నీ: అసలైన క్రికెట్‌ మజా కేవలం పురుషుల క్రికెట్‌లోనే ఉంటుందనుకుంటే పొరపాటు పడినట్టే. సంచలన ఇన్నింగ్స్‌లు నమోదు చేస్తూ.. పురుషుల క్రికెట్‌లోనూ సాధ్యంకాని కొత్త రికార్డులను మహిళా క్రికెటర్లు సృష్టిస్తున్నారు. తాజాగా గెలుపును డిసైడ్‌ చేసే బంతిని బౌండరీ వద్ద కళ్లు చెదిరే రీతిలో డైవ్‌ చేస్తూ ఒడిసిపట్టుకున్న విధానం చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ అపురూప దృశ్యం మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో  బ్రిస్బెన్‌ హీట్‌, సిడ్నీ థండర్‌ జట్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సిడ్నీ జట్టు నాలుగు పరుగుల తేడాతో బ్రిస్బేన్‌పై గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. క్యాచ్‌కు సంబంధించిన వీడియో ఐసీసీ తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఇక హైదీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన బ్రిస్బేన్‌ హీట్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అనంతరం 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ జట్టు ఆరంభం ఘనంగానే ప్రారంభించింది. అయితే బ్రిస్బేన్‌ పటిష్ట బౌలింగ్‌ మందు సిడ్నీ మిడిలార్డర్‌ బ్యాట్స్‌వువెన్‌ పరుగులు రాబట్టడానికి నానా తంటాలు పడ్డారు. దీంతో చివరి ఓవర్లో 13 పరుగుల చేస్తేనే సిడ్నీ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. బంతి బంతికి సమీకరణాలు మారిపోతున్నాయి. ఇక సిడ్నీ గెలుపు సమీకరణాలు ఎలా ఉన్నాయంటే చివరి బంతికి ఫోర్‌ కొడితే డ్రా, ఐదు పరుగులు చేస్తే విజయం. ఈ సమయంలో జోనాసెన్‌ బౌలింగ్‌లో నికోలా కారే గాల్లోకి బంతిని బలంగా బాదింది.. అందరూ పక్కా సిక్సర్‌ అనుకున్న తరుణంలో మెరుపువేగంతో వచ్చిన హైదీ బిర్కెట్‌ కళ్లు చెదిరే రీతిలో డైవ్‌ చేస్తూ క్యాచ్‌ అందుకుంది. దీంతో గెలుపు సంబరం బ్రిస్బెన్‌ను వరించగా .. ఓటమి బాధ సిడ్నీ జట్టుకు దక్కింది.

మరిన్ని వార్తలు