95 నిమిషాలు.. 45 బంతులు.. కానీ డకౌట్‌

25 Aug, 2019 11:39 IST|Sakshi

ఆంటిగ్వా:  టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో విండీస్ చివరి వరుస ఆటగాడు మిగెల్ కమిన్స్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో  పదో నంబరు ఆటగాడిగా క్రీజులోకి వచ్చిన మిగెల్ 45 బంతులు ఆడి సున్నాకే పెవిలియన్‌ చేరాడు. ఫలితంగా అత్యధిక బంతులు ఆడి డకౌట్ అయిన విండీస్ క్రికెటర్‌గా మిగెల్ తన పేరును లిఖించుకున్నాడు.

మిగెల్ కంటే ముందు కె. అర్ధర్‌టన్ 40 బంతులు, ఎం.డిల్లాన్ 29 బంతులు, సి.బట్స్ 27 బంతులు, ఆర్.ఆస్టిన్ 24 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఇప్పుడు వీరందరి కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొని డకౌట్ అయిన విండీస్ ఆటగాడిగా కమిన్స్ రికార్డులకెక్కాడు.( ఇక్కడ చదవండి: గంగూలీ-సచిన్‌ల రికార్డు బ్రేక్‌)

2002లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో విండీస్ క్రికెటర్ కె.అర్థర్‌టన్ 40 బంతులు ఎదుర్కొని డకౌట్ అవ్వగా, షార్జాలో 2002లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎం.డిల్లాన్ 29 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. 1988లో ఇండియాతో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో సి.బట్స్ 27 బంతులు ఎదుర్కొని డకౌట్ కాగా, 2009లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్.ఆస్టిన్ 24 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండానే అవుటయ్యాడు. ఇప్పుడు కమిన్స్‌ వీరందర్నీ తలదన్నేలా అత్యధికంగా 45 బంతులు ఆడి డకౌట్‌ అయ్యాడు. మరొక విషయం ఏమిటంటే కమిన్స్‌ 95 నిమిషాల పాటు క్రీజ్‌లో ఉండటం గమనార్హం.చివరకు రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఆఖరి వికెట్‌గా కమిన్స్‌ ఔటయ్యాడు.

మరిన్ని వార్తలు