వార్నర్ 'గర్జన' ఏది?

10 Jun, 2017 18:03 IST|Sakshi
వార్నర్ 'గర్జన' ఏది?

బర్మింగ్హోమ్: డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొంతకాలంగా ఆసీస్ విజయాల్లో వార్నర్ పాత్ర  వెలకట్టలేనిది. అటు టెస్టులైనా, ఇటు వన్డేలైనా, మరొకవైపు ట్వంటీ 20 లీగ్లైనా వార్నర్ మార్క్ ఉండాల్సిందే. ఆ క్రమంలోనే 2016లో ఏడు వన్డే సెంచరీలు చేసి ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక ఆసీస్ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఓవరాల్ గా ఒక ఏడాదిలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ తరువాత స్థానం పొందాడు.

ఇదిలా ఉంచితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే వన్డే టోర్నమెంట్లలో మాత్రం వార్నర్ ఇప్పటివరకూ భారీ స్కోర్లు చేసిన దాఖలాలు లేవు.  ఇప్పటివరకూ ఐసీసీ నిర్వహించిన టాప్-8 జట్లపై వార్నర్ వన్డే సగటు 26. మొత్తం 10 ఇన్నింగ్స్ ల్లో వార్నర్ చేసిన పరుగులు 234. అందులో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 45 మాత్రమే.  ప్రతీ చోట తనదైన ముద్రను  వేసే వార్నర్.. ఇలా ఐసీసీ నిర్వహించే ప్రధాన టోర్నమెంట్లలో గర్జించకపోవడం ఆసీస్ ను ఆందోళన పరుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శనివారం ఇంగ్లండ్ తో జరుగుతున్న కీలకమైన మ్యాచ్ లో వార్నర్ (21) నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ లో ఆసీస్ గెలిస్తేనే సెమీస్ లోకి చేరుతుంది.

>
మరిన్ని వార్తలు