ద్రవిడ్‌కు స్పెషల్‌ విషెస్‌!

11 Jan, 2020 11:19 IST|Sakshi

న్యూఢిల్లీ:  భారత క్రికెట్‌కు మరింత వన్నె తెచ్చిన ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌. మిస్టర్‌ డిఫెండబుల్‌గా పిలవబడే రాహుల్‌ ద్రవిడ్‌కు ‘ద వాల్‌’ అనే పేరు కూడా ఉంది. క్రికెట్‌ పుస్తకాల్లోని కచ్చితమైన షాట్లకు పెట్టింది పేరు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 24 వేలకు పైగా పరుగులు సాధించి దిగ్గజ క్రికెటర్‌.

అటు క్లాస్‌, ఇటు టైమింగ్‌ ద్రవిడ్‌ సొంతం. అది టెస్టు మ్యాచ్‌ అయినా, లేక వన్డే అయినా ద్రవిడ్‌ పరిస్థితులకు తగ్గట్టు ఆడేవాడు. బ్యాట్‌ ఝుళిపించాల్సిన పరిస్థితుల్లో ద్రవిడ్‌ ఆడే తీరు అభిమానుల్లో జోష్‌ నింపేది. ప్రస్తుతం నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా కొనసాగుతున్న ద్రవిడ్‌ 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ మేరకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) ద్రవిడ్‌కు స్పెషల్‌గా అభినందనలు తెలిపింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భాగంగా ద్రవిడ్‌ ఆటను వీడియో రూపంలో పోస్ట్‌ చేసింది. పలువురు వెటరన్‌ క్రికెటర్లు, మాజీలు సైతం ద్రవిడ్‌కు అభినందనలు తెలుపుతున్నారు.

‘హ్యాపీ బర్త్‌ డే రాహుల్‌ ద్రవిడ్‌.. వాటే లెజెండ్‌’ అని హర్భజన్‌ సింగ్‌ విష్‌ చేయగా, ‘ నువ్వొక స్ఫూర్తి, రోల్‌ మోడల్‌, లెజెండ్‌’ అంటూ మహ్మద్‌ కైఫ్‌ శుభాకాంక్షలు తెలిపాడు. ‘  అసాధారణ క్రికెటర్‌.. ఒక మంచి మనిషి’ అంటూ వ్యాఖ్యాత హర్షా భోగ్లే అభినందనలు తెలిపాడు. భారత అండర్‌-19, భారత్‌-ఏ జట్లకు కోచ్‌గా చేసిన ద్రవిడ్‌.. ఆపై నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. రాబోవు తరాల క్రికెటర్లకు దిశా నిర్దేశం చేస్తూ భారత్‌ క్రికెట్‌ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడానికి ద్రవిడ్‌ కృషి చేస్తున్నాడు.

>
మరిన్ని వార్తలు