ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ విశేషాలు..

14 Feb, 2015 17:12 IST|Sakshi

మెల్బోర్న్: ఆస్ట్రేలియా మ్యాచ్లో ఇంగ్లండ్ బౌలర్ ఫిన్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. తాజా ప్రపంచ కప్లో ఇదే తొలి హ్యాట్రిక్. ప్రపంచకప్ పూల్-ఎలో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్ విశేషాలు..

  • ఫిన్ ఇన్నింగ్స్ చివరి మూడు బంతుల్లో వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు.  ప్రపంచకప్లో ఇదే తొలి హ్యాట్రిక్. ఓవరాల్గా ప్రపంచ కప్లో హ్యాట్రిక్ వికెట్ తీసిన ఏడో బౌలర్గా ఫిన్ నిలిచాడు.
  • ఫిన్ 5 వికెట్లు పడగొట్టినా భారీగా పరుగులు (71) సమర్పించుకున్నాడు.
  • ఫించ్ (135) కిది ఐదో వన్డే సెంచరీ.
  • ఆసీస్ బ్యాట్స్మెన్ బెయిలీ (55), మ్యాక్స్వెల్ (66) హాఫ్ సెంచరీలతో రాణించారు.
  • ఇంగ్లండ్ జట్టులో జేమ్స్ టేలర్ (98) మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు. కాగా కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
  • ఆసీస్ పేసర్ మిచెల్ మార్ష్ (5/33) అద్భుత ప్రదర్శన నమోదు చేశాడు.
  • ప్రపంచ కప్లో ఇంగ్లండ్పై ఆసీస్కిది ఐదో విజయం. ఇరు జట్లు 7 సార్లు తలపడగా, ఆసీస్ 5, ఇంగ్లండ్ 2 సార్లు గెలిచాయి.
  • మెల్బోర్న్లో ఇంగ్లండ్పై కంగారూలకిది 11వ విజయం. ఇరు జట్లు 13 మ్యాచ్లు ఆడగా ఇంగ్లండ్ కేవలం రెండింటిలోనే నెగ్గింది.
  • ఇన్నింగ్స్ ఐదో బంతికి ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇంగ్లండ్ ఫీల్డర్ వోక్స్ సునాయాస క్యాచ్ పట్టలేకపోయాడు. అప్పటికి  పరుగుల ఖాతా తెరవలేకపోయిన ఫించ్ ఆనక సూపర్ సెంచరీ చేసి ఆసీస్కు భారీ స్కోరు అందించాడు.
     

>
మరిన్ని వార్తలు