ఇంగ్లండ్‌ విజయం

27 Jun, 2017 23:54 IST|Sakshi
ఇంగ్లండ్‌ విజయం

లీస్టర్‌ (ఇంగ్లండ్‌): మహిళల వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు తొలి విజయం నమోదు చేసింది. పాకిస్తాన్‌తో మంగళవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 107 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 377 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ హీథెర్‌నైట్‌ (109 బంతుల్లో 106; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), నటాలీ సివెర్‌ (92 బంతుల్లో 137; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలు చేయడం విశేషం. వీరిద్దరూ మూడో వికెట్‌కు 213 పరుగులు జోడించారు. అనంతరం పాకిస్తాన్‌ 29.2 ఓవర్లలో 3 వికెట్లకు 109 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో మిగతా ఓవర్ల ఆట సాధ్యపడలేదు. డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ నిలిచే సమయానికి పాకిస్తాన్‌ 214 పరుగులు చేయాల్సింది. బుధవారం జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో దక్షిణాఫ్రికా ఆడుతుంది.

మరిన్ని వార్తలు