ఫ్యూచర్ స్టార్ ఇన్నింగ్స్ విజయం

5 Nov, 2016 10:55 IST|Sakshi

హైదరాబాద్: తొలిరోజు బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న ఫ్యూచర్‌స్టార్ ఆటగాళ్లు రెండో రోజు బౌలింగ్‌లోనూ రెచ్చిపోయారు. దీంతో డబ్ల్యూఎంసీసీతో జరిగిన మ్యాచ్‌లో ఫ్యూచర్‌స్టార్ జట్టు ఇన్నింగ్‌‌స విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం 54/4 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్‌‌సను ప్రారంభించిన డబ్ల్యూఎంసీసీ జట్టు 19.3 ఓవర్లలో 9 వికెట్లకు 92 పరుగులు చేసి ఇన్నింగ్‌‌సను డిక్లేర్ చేసింది.

 

శ్రీధర్ రెడ్డి 7 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్‌‌సను ప్రారంభించిన డబ్ల్యూఎంసీసీ జట్టు 32 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. అజయ్ సింగ్ (82 నాటౌట్) పోరాడాడు. ప్రత్యర్థి బౌలర్లలో సోహాన్ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్‌‌సలో ఫ్యూచర్‌స్టార్ జట్టు 71.4 ఓవర్లలో 9 వికెట్లకు 350 పరుగులు చేసింది.

 

మరిన్ని వార్తలు