కోహ్లిని రెచ్చగొట్టొద్దు: డు ప్లెసిస్‌

17 Nov, 2018 13:14 IST|Sakshi

కేప్‌టౌన్‌: ప్రస్తుతం ప్రపంచ టెస్టు ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో జాగ్రత్తగా ఉండాలంటూ ఆసీస్‌ క్రికెట్‌ జట్టును దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ హెచ్చరించాడు. త్వరలో భారత్‌-ఆసీస్‌ జట్ల మధ్య సుదీర్ఘ ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో డుప్లెసిస్‌ మాట్లాడుతూ.. ‘ విరాట్‌ కోహ్లి వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌ అనే సంగతి మరచిపోవద్దు. అతన్ని ఎంత రెచ్చగొట్టకుండా ఉంటే అంత మంచిది. కోహ్లిలో పోరాట స్ఫూర్తి ఎక్కువ.

సాధారణంగా జట్టులోని ప్రధాన ఆటగాళ్లను ప్రత్యర్థి జట్లు టార్గెట్‌ చేస్తూ ఉంటాయి. అందులో ఆసీస్‌ ముందు వరుసలో ఉంటుంది. కానీ కోహ్లి విషయంలో ఆసీస్‌ చాలా జాగ్రత్తగా ఉండాలి. కోహ్లికి సైలెంట్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వడమే కరెక్ట్‌. గతంలో భారత్‌తో జరిగిన సిరీస్‌లో కోహ్లి వ్యవహారంలో మేము ఇలానే చేసి సక్సెస్‌ అయ్యాం. అతనొక అసాధారణ ఆటగాడు. ప్రతీ జట్టుకు వారి వారి ప్రణాళికలు ఉంటాయి. మేము కోహ్లిని భారీ ఇన్నింగ్స్‌లు నమోదు చేయకుండా ఎలా చేసేమో అనేది మాత్రమే స్పష్టం చేశా.. కోహ్లిని రెచ‍్చగొట్టొద్దు అనేది ఆసీస్‌కు నేనేచ్చి సలహా మాత్రమే’ అని డుప్లెసిస్‌ తెలిపాడు.

ఇక్కడ చదవండి: ఆస్ట్రేలియా బయల్దేరిన టీమిండియా

భారత్‌ సిరీస్‌ నెగ్గక పోతేనే ఆశ్చర్యం!

ఆసీస్‌-టీమిండియా పూర్తి షెడ్యూల్‌ ఇదే..

మరిన్ని వార్తలు