హామిల్టన్‌కు ‘పోల్‌’

25 Jun, 2017 01:15 IST|Sakshi
హామిల్టన్‌కు ‘పోల్‌’

బాకు (అజర్‌బైజాన్‌): ఈ సీజన్‌లో నాలుగో టైటిల్‌ సాధించడమే లక్ష్యంగా మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ హామిల్టన్‌ అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి బరిలోకి దిగనున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ సెషన్‌లో హామిల్టన్‌ అందరికంటే వేగంగా ఒక నిమిషం 40.593 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి పోల్‌ పొజిషన్‌ సంపాదించాడు.

ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది ఐదో పోల్‌ పొజిషన్‌. బొటాస్‌ (మెర్సిడెస్‌), రైకోనెన్, వెటెల్‌ (ఫెరారీ) రెండు, మూడు, నాలుగు స్థానాల నుంచి... ఫోర్స్‌ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఒకాన్‌ వరుసగా ఆరు, ఏడు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు.

మరిన్ని వార్తలు