'హర్మన్ కు అతడే ఆదర్శం'

21 Jul, 2017 15:10 IST|Sakshi
'హర్మన్ కు అతడే ఆదర్శం'

చండీగఢ్: మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని భారత్ ను ఫైనల్ కు చేర్చిన హర్మన్ ప్రీత్ కు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆదర్శమట. తన క్రికెట్ కెరీర్ లో డాషింగ్ ఓపెనర్ పేరుగాంచిన సెహ్వాన్ ను బ్యాటింగ్ ఐడల్ గా తీసుకునే హర్మన్ పెరిగిందని ఆమె సోదరి హెమ్జిత్ తెలిపారు.

'హర్మన్ బాల్యం నుంచి చూస్తే బాయ్స్ తోనే ఎక్కువగా క్రికెట్ ఆడేది. ఎప్పుడూ పరుగుల కోసం పరితపిస్తూ స్ట్రైక్ రేట్ ను మెరుగ్గా ఉంచుకునేది. హర్మన్ ఎప్పుడూ సానుకూల ధోరణితోనే ఉంటుంది. ప్రధానంగా ఆన్ ఫీల్డ్ లో విరాట్ కోహ్లి తరహాలో దూకుడును ప్రదర్శిస్తుంటుంది. ఆఫ్ ఫీల్డ్ లో కూల్ అండ్ కామ్. ఆమె ఆరాధ్య క్రికెటర్ సెహ్వాగే. సెహ్వాగ్ ఆటను ఎక్కువగా ఆస్వాదించేది.  ఇక హర్మన్ రోల్ మోడల్ విషయానికొస్తే తండ్రి హర్మందర్ సింగ్. మా నాన్నే హర్మన్ తొలి కోచ్. మా నాన్న మంచి క్రికెటర్. కానీ ఇబ్బందులు కారణంగా గేమ్ లో ముందుకువెళ్లలేకపోయారు. అతని కల హర్మన్ ప్రీత్ రూపంలో నిజమైంది' అని హెమ్జిత్ అన్నారు.

హర్మన్ ప్రీత్ కౌర్‌ ధనాధన్‌ ఆటతో ఇండియా టీమ్‌ ఫైనల్లోకి దూసుకెళడంతో పంజాబ్‌లోని మోగాలో కౌర్‌ కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా హెమ్జిత్ మీడియాతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు