ఫేక్‌ సర్టిఫికేట్స్‌: స్పందించిన హర్మన్‌ ప్రీత్‌

14 Jul, 2018 12:45 IST|Sakshi
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

న్యూఢిల్లీ : నకిలీ సర్టిఫికేట్స్‌ సమర్పించారని  టీమిండియా మహిళా టీ 20 కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ను పంజాబ్‌ పోలీస్‌ శాఖ డీఎస్పీ ఉద్యోగం నుంచి తొలిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంపై తాజాగా హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ స్పందించారు. అవి నకిలీ సర్టిఫికేట్స్‌ కాదని తాను పరీక్షల్లో పాసై పొందినవేనని స్పష్టం చేశారు. ఆమె ఈఎస్‌పీన్‌ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడుతూ.. ‘నేను పోస్ట్‌ గ్రా‍డ్జ్యూయేషన్‌లో కూడా అడ్మిషన్‌ తీసుకున్నాను. వీదేశీ పర్యటనల వల్ల ఆ పరీక్షలకు హాజరుకాలేకపోయాను. కానీ నా డిగ్రీ సర్టిఫికేట్‌ను నకిలీవి అంటున్నారు. మీలాగా నేను హెడ్‌ ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతూ.. నా ఎన్‌రోల్‌మెంట్‌ నెంబర్‌తో రుజువు చేయలేను. ఎందుకంటే నేను క్రికెటర్‌. నా దృష్టంతా ఆటపైనే ఉంటుంది. కేవలం డిగ్రీ పూర్తి చేయాలనే చదివాను. నేను అన్ని సబ్జెక్ట్‌లో పాస్‌ అయ్యాను. ప్రతి సర్టిఫికేట్‌ లీగలే. ఢిల్లీలో నేను పరీక్షలు రాశాను. నాసబ్జెక్ట్‌లు సోషియాలజీ, పొలిటికల్‌ సైన్స్‌, ఇంగ్లీష్‌, జనరల్‌ అవార్‌నెస్‌’ అని తెలిపారు.

అయితే ఈ మహిళా క్రికెటర్‌ను ఏకకాలంలొ కష్టాలు చుట్టుముట్టాయి. ఓ వైపు ఆసియా టీ20 టోర్నీ ఫైనల్లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిపోయి ఒత్తిడిలో ఉండగా.. మరోవైపు ఈ నకిలీ సర్టిఫికేట్స్‌ వివాదం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఆమె తన డీఎస్పీ ఉద్యోగాన్ని కోల్పోయారు. గతేడాది మహిళల వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఒంటి చేత్తో హర్మన్‌ ప్రీత్‌ భారత్‌ను గెలిపించారు. ఈ ప్రదర్శనకు మెచ్చి పంజాబ్‌ ప్రభుత్వం ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. అయితే పోలీస్‌ శాఖకు సమర్పించిన డిగ్రీ సర్టిఫికేట్స్‌ నకిలీవని తేలడంతో వారు ఉద్యోగం నుంచి తొలిగించారు.

చదవండి: హర్మన్‌ ఇప్పుడు డీఎస్పీ కాదు! 

మరిన్ని వార్తలు