మహిళల మూడో వన్డే రద్దు

25 Aug, 2014 20:05 IST|Sakshi

లండన్:ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టును కూడా వరుణుడు వదిలి పెట్టలేదు. సోమవారం జరగాల్సిన భారత-ఇంగ్లండ్ ల పురుషుల తొలి వన్డేకు వర్షం ఆటంకం కల్గించడంతో ఆ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. అయితే మహిళల విభాగంలో జరగాల్సిన మూడో వన్డేను కూడా వర్షం అడ్డుకుంది. లార్డ్స్ లో భారీ వర్షం కురవడంతో మూడో వన్డేను రద్దు చేయకతప్పలేదు. తొలి వన్డేలో స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్‌లో విఫలమైన భారత మహిళల జట్టు... ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఆతిథ్య జట్టు 2-0తో సిరీస్ ను గెలుచుకుంది.

 

ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలుపుకుందామనుకున్న భారత మహిళలకు ఆ ఆశ తీరలేదు. ఇంగ్లండ్ మహిళలతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత్ మహిళలు విజయం సాధించినా.. వన్డేల్లో మాత్రం ఘోరంగా విఫలమైయ్యారు.

మరిన్ని వార్తలు