టీమిండియా తడబాటు

30 Sep, 2016 16:55 IST|Sakshi
టీమిండియా తడబాటు

కోల్ కతా: న్యూజిల్యాండ్ తో కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో తొలిరోజు భారత క్రికెటర్లు తడబడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా టాప్ ఆర్డర్ వికెట్లను త్వరగా చేజార్చుకుంది. మొదటి ఇన్నింగ్స్ ను ఆరంభించిన భారత ఓపెనర్లు శిఖర్ ధావన్(1), మురళి విజయ్(9), కెప్టెన్ విరాట్ కోహ్లీ(9) పరుగులకే అవుటయ్యారు. దీంతో కష్టాల్లో చిక్కుకున్న భారత్ ను పూజారా(87), రహానే(77)లు మరో వికెట్ పడకుండా పరుగులు జోడించారు.

టీ విరామానికి భారత్ గౌరవప్రదమైన చేస్తుందని అనిపించే దశకు తెచ్చారు. తర్వాత వాగ్నర్ బౌలింగ్ లో పూజారా వెనుదిరిగాడు. ఒక్కసారిగా కివీస్ బౌలర్లు విజృంభించడంతో మరో మూడు వికెట్లు త్వరగా నేల కూలాయి. కివీస్ బౌలర్లలో ఎంజే హెన్రీ మూడు వికెట్లు, జేఎస్ పటేల్ రెండు వికెట్లు, బౌల్ట్, వాగ్నెర్ లు చెరో వికెట్ తీశారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. వృద్ధిమాన్ సాహా(14), రవీంద్ర జడేజా(0)లతో క్రీజులో ఉన్నారు. వెలుతురు సరిగా లేని కారణంగా నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే అంపైర్లు తొలిరోజు ఆటను నిలిపివేశారు.

మరిన్ని వార్తలు