టీమిండియా అంటే అదొక్కటే కాదు:స్మిత్

19 Sep, 2017 16:46 IST|Sakshi
టీమిండియా అంటే అదొక్కటే కాదు:స్మిత్

న్యూఢిల్లీ: భారత్ తో ఐదు వన్డేల సిరీస్లో తొలి వన్డేలో ఓటమి పాలైన తమ జట్టును ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ హెచ్చరించాడు. ఇక నుంచైనా టీమిండియాతో మ్యాచ్లకు సిద్దమయ్యేటప్పుడు ఎటువంటి ఉదాసీనతకు తావివ్వకూడదని సహచర ఆటగాళ్లను మేలుకొల్పే యత్నం చేస్తున్నాడు.

 

'టీమిండియా అంటే స్పిన్ ఒక్కటే కాదు.. వారి వద్ద రకరకాల బౌలింగ్ ఆయుధాలున్నాయి. ఆ తరహాలోనే ప్రాక్టీస్ చేయండి. మేము కేవలం మణికట్టు స్పిన్నర్లపై ఫోకస్ చేయలేదు.  మా ఫాస్ట్ బౌలర్లతోనే నెట్స్లో  ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాం. భారత జట్టులో నాణ్యమైన సీమర్లున్నారు. శ్రీలంకతో సిరీస్ లో భారత  పేసర్లు వైవిధ్యమైన బౌలింగ్ తో రాణించారు. ఆ ఫుటేజ్ను మా జట్టులోని ప్రతీ సభ్యుడు చూశాడు. టీమిండియా స్పిన్ బౌలింగ్ తో పాటు పేస్ బౌలింగ్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి' అని స్మిత్ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు