చెత్త రికార్డు నమోదు చేసిన భారత్‌

10 Dec, 2017 12:46 IST|Sakshi

ఐదు వికెట్లు కోల్పోయిన భారత్‌

ధర్మశాల: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌ చెత్త రికార్డును మూట గట్టుకుం‍ది.  పవర్‌ ప్లే ముగిసే సరికి భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గత ఐదేళ్లలో వన్డేల్లో 10 ఓవర్లకు అత్యల్ప స్కోరు నమోదు చేసి తొలి జట్టుగా ఈ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇక ఓవరాల్‌గా ఈ చెత్త రికార్డు నమోదు చేసిన రెండో జట్టుగా నిలిచింది. భారత్‌ ఆడిన తొలి ఐదు ఓవర్లలో నాలుగు ఓవర్లు మేడిన్‌ కావడం గమనార్హం.

ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ డకౌట్‌, రోహిత్‌ శర్మ(2),లు విఫలమవ్వడం, దినేశ్‌ కార్తీక్‌ డకౌట్‌లు కావడంతో భారత్‌కు ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ చెత్త రికార్డు రోహిత్‌ కెప్టెన్సీ వహిస్తున్న తొలి మ్యాచ్‌లోనే కావడం విశేషం. ఇక మరో వైపు వరుస గెలుపులతో రికార్డులు నమోదు చేసిన భారత జట్టు.. ఈ చెత్త రికార్డును మూటగట్టుకోవడం భారత అభిమానులకు మింగుడుపడటం లేదు.

మరిన్ని వార్తలు