టీమిండియా నిలకడ

5 Dec, 2015 12:03 IST|Sakshi
టీమిండియా నిలకడ

ఢిల్లీ:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాల్గో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఎనిమిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి తడబడినట్లు కనిపించినా టీమిండియా.. ఆ తరువాత నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఆదిలో మురళీ విజయ్(3), రోహిత్ శర్మ(0) వికెట్లను స్వల్ప వ్యవధిలో నష్టపోయిన విరాట్ సేన ఒక్కసారిగా ఆందోళనలో పడింది. ఆ రెండు వికెట్లు మోర్నీ మోర్కెల్ తీసి టీమిండియాకు షాకిచ్చాడు. కాగా, బర్త్ డే బాయ్ శిఖర్ ధవన్(20 బ్యాటింగ్), చటేశ్వరా పూజారా(27 బ్యాటింగ్) కుదురుగా ఆడటంతో టీమిండియా లంచ్ విరామ సమయానికి మరో వికెట్ పడకుండా 51 పరుగులు చేసింది.

 

దీంతో టీమిండియా 264 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. టీమిండియా శనివారం అంతా బ్యాటింగ్ కొనసాగిస్తే దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచే అవకాశం ఉంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 334 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 121 పరుగులకు చాపచుట్టేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు