శ్రీలంకకు భారీ విజయలక్ష్యం

12 Feb, 2016 21:15 IST|Sakshi
శ్రీలంకకు భారీ విజయలక్ష్యం

రాంచీ: మూడు టీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో జరుగుతున్న రెండో మ్యాచ్లో టీమిండియా 197 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ధోని సేన ఆది నుంచి దూకుడుగా ఆడింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ లో శిఖర్ ధావన్(51; 25 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్సర్లు) దూకుడుగా ఆడి భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. జట్టు స్కోరు 75 పరుగుల వద్ద శిఖర్ ధావన్ తొలి వికెట్ గా అవుట్ కావడంతో టీమిండియా దూకుడు కాస్త తగ్గింది. అనంతరం రోహిత్ శర్మ(43; 35 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్సర్) బాధ్యతాయుతంగా ఆడి రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆపై అజింక్యా రహానే(25) మోస్తరుగా ఫర్వాలేదనిపించి మూడో వికెట్ గా అవుటయ్యాడు. అటు తరువాత సురేష్ రైనా(30), పాండ్యా(27)లు  జాగ్రత్తగా ఆడటంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, కెప్టెన్ ధోని(5 ) నాటౌట్ గా నిలిచాడు. శ్రీలంక బౌలర్లలో పెరీరా మూడు, చమీరా రెండు వికెట్లు తీశారు.


తొలి బంతి నుంచే దూకుడు

రోహిత్ శర్మ తొలి బంతి నుంచే దూకుడును కొనసాగించాడు. కాశున్ వేసిన తొలి బంతినే ఫోర్కు పంపిన రోహిత్.. మొదటి ఓవర్ లో ఏడు పరుగులు సాధించాడు. ఆ ఓవర్ లో ధావన్ కు రెండు బంతులు ఆడే అవకాశం వచ్చినా పరుగులు తీయలేదు. ఆ తరువాత రెండో ఓవర్ రెండో బంతికి రెండు పరుగులు తీసిన ధావన్ కొద్ది సేపటి తరువాత తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఒకపక్క రోహిత్ కుదురుగా ఆడుతుంటే, శిఖర్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే శిఖర్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ జోడీ తొలి వికెట్ కు 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో  టీ20ల్లో భారత్ లో భారత్ తరపున రెండో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

మరోవైపు 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి భారత్ తరపున అత్యంత వేగంగా ఆ ఫీట్ ను సాధించిన మూడో ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. గతంలో టీ 20ల్లో గంభీర్ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే, యువరాజ్ సింగ్ 20 బంతుల్లో ఒకసారి, 12 బంతుల్లో మరొకసారి ఆ ఘనతను నమోదు చేసిన వారిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు