సరదాగా... షాపింగ్ చేసి...

11 Nov, 2014 00:34 IST|Sakshi
సరదాగా... షాపింగ్ చేసి...

సాక్షి, హైదరాబాద్: మూడో వన్డే తర్వాతి రోజు భారత్, శ్రీలంక క్రికెటర్లు నగరంలో సరదాగా గడిపారు. సోమవారం ఉదయం 6 గంటలకే భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్కశర్మతో కలిసి ముంబై వెళ్లిపోగా...మిగతా ఆటగాళ్లు రోజంతా నగరంలోనే ఉన్నారు. పలువురు శ్రీలంక క్రికెటర్లతో పాటు భారత బౌలర్ వరుణ్ ఆరోన్ కూడా బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్‌లో షాపింగ్ చేశారు. మరి కొంత మంది హోటల్ వీడి నగరంలోని కొంత మంది మిత్రులను కలిసేందుకు బయటికి వెళ్లారు.

అశ్విన్, మురళీ విజయ్ మాత్రం జింఖానా మైదానానికి వెళ్లి సుబ్బయ్యపిళ్లై టోర్నీలో తమిళనాడు, కర్ణాటక మధ్య మ్యాచ్ చూశారు. సాయంత్రం 7.45 గంటలకు ఒకే విమానంలో ఇరు జట్ల ఆటగాళ్లు కోల్‌కతా బయల్దేరి వెళ్లారు. తర్వాతి మ్యాచ్‌లకు టీమ్‌లో లేని జడేజా, మిశ్రా తదితరులు మాత్రం వేరుగా బయల్దేరగా, లంక జట్టులో సంగక్కరతో పాటు మరో ముగ్గురు క్రికెటర్లు చెన్నై మీదుగా శ్రీలంకకు వెళ్లిపోయారు.

 శ్రీవారి సేవలో దిల్షాన్...
 సాక్షి,తిరుమల: శ్రీలంక క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నాడు. ఉదయం నైవేద్య విరామ సమయం తర్వాత దిల్షాన్ ఆలయానికి వచ్చారు.

మరిన్ని వార్తలు