పార్టీలే చెడగొట్టాయి జస్టిస్ ముద్గల్ వ్యాఖ్య

19 Feb, 2014 00:56 IST|Sakshi
పార్టీలే చెడగొట్టాయి జస్టిస్ ముద్గల్ వ్యాఖ్య

 ఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారత క్రికెట్‌కు మంచిదే అయినప్పటికీ... కాసుల వర్షం కురవడమే అసలు వివాదాలకు కారణమని జస్టిస్ ముకుల్ ముద్గల్ అన్నారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై ఇటీవలే ఆయన సమర్పించిన నివేదిక భారత క్రికెట్‌లో సంచలనం రేపింది. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన పార్టీలే మొత్తం వివాదాలకు కేంద్ర బిందువయ్యాయని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో చెప్పారు. తానిచ్చిన నివేదికతో ఇప్పుడు వివాదాలు తగ్గు ముఖం పడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 
 ‘నిస్సందేహంగా ఈ టోర్నీ యువ ఆటగాళ్లకు మంచి అవకాశాల్ని కల్పించింది. ఐపీఎల్‌లో ఆటగాళ్లపై కనకవర్షం కురిసింది. వారిని సెలెబ్రిటీలను చేసింది. అనుకోకుండా వచ్చి పడిన డబ్బుల కారణంగా వారిలో అహంకారం పెరిగిపోయింది. అయితే ఆటగాళ్లు డబ్బులు సంపాదించడానికి నేను వ్యతిరేకం కాదు’ అని జస్టిస్ ముద్గల్ అన్నారు. లేట్‌నైట్ పార్టీలు కొందరు యువ ఆటగాళ్లను చెడగొట్టాయని ముద్గల్ విమర్శించారు.
 

మరిన్ని వార్తలు