అతడికి క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు!

13 Apr, 2017 12:05 IST|Sakshi
అతడికి క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు!

న్యూఢిల్లీ: ఐపీఎల్‌-10లో ఇంకా బరిలోకి దిగకపోయినా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. ఈ సీజన్‌ లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకపోయినా సోషల్ మీడియాలో అతడికి క్రేజ్‌ కొనసాగుతోంది. ఐపీఎల్‌ లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌ గా వ్యవహరిస్తున్న విరాట్‌ ను ఫేస్ బుక్‌, ఇన్ స్టాగ్రామ్‌ లో అత్యధిక మంది అనుసరిస్తున్నారు.

ఐపీఎల్‌ ఆటగాళ్లలో మోస్‌ ఫాలోవ్డ్‌, లైకెడ్‌ క్రికెటర్ గా ఈ స్టార్‌ బ్యాట్స్‌ మన్‌ నిలిచాడని ఫేస్ బుక్‌, ఇన్ స్టాగ్రామ్‌ అధికారిక ప్రకటనలో వెల్లడించాయి. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని రెండో స్థానంలో నిలవడం గమనార్హం. కాగా, గాయం కారణంగా మొదటి మూడు మ్యాచ్‌ లకు దూరమైన కోహ్లి రేపు(శుకవారం) బెంగళూరులో ముంబై ఇండియన్స్‌ తో జరిగే మ్యాచ్‌ లో బరిలోకి దిగనున్నాడు. అతడు ఎలా ఆడతాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఫేస్‌ బుక్‌ టాప్‌-10 ప్లేయర్స్ లిస్ట్‌
1. విరాట్‌ కోహ్లి(బెంగళూరు)
2. ఎంఎస్‌ ధోని(పుణె)
3. యువరాజ్‌ సింగ్‌(హైదరాబాద్‌)
4. రోహిత్‌ శర్మ(ముంబై)
5. షకీబ్‌ అల్‌ హసన్‌(కోల్‌ కతా)
6. క్రిస్‌ గేల్‌(బెంగళూరు)
7. శిఖర్‌ ధావన్‌(హైదరాబాద్‌)
8. గౌతమ్‌ గంభీర్‌(కోల్‌ కతా)
9. హర్భజన్‌ సింగ్‌(ముంబై)
10. గ్లెన్‌ మ్యాక్స్‌ వెల్‌(పంజాబ్)

ఇన్‌ స్టాగ్రామ్‌ టాప్‌-10 ప్లేయర్స్ లిస్ట్‌
1. విరాట్‌ కోహ్లి(బెంగళూరు)
2. ఎంఎస్‌ ధోని(పుణె)
3. డివిలియర్స్‌(బెంగళూరు)
4. యువరాజ్‌ సింగ్‌(హైదరాబాద్‌)
5. రోహిత్‌ శర్మ(ముంబై)
6. సురేశ్‌ రైనా(గుజరాత్‌)
7. క్రిస్‌ గేల్‌(బెంగళూరు)
8. హర్భజన్‌ సింగ్‌(ముంబై)
9. రవీంద్ర జడేజా(గుజరాత్‌)
10. అజింక్య రహానే(పుణె)

మరిన్ని వార్తలు