లేడీ ఏకలవ్య చాంగ్ హేజిన్

13 Aug, 2016 02:49 IST|Sakshi
లేడీ ఏకలవ్య చాంగ్ హేజిన్

మహిళల వ్యక్తిగత ఆర్చరీలో కొరియన్ చాంగ్ హేజిన్ స్వర్ణం సాధించింది. ఫైనల్లో జర్మనీ ఆర్చర్ లీసా ఉన్రుపై 6-2తో గెలిచింది. ఇది రియోలో చాంగ్‌కు రెండో స్వర్ణం. సోమవారం జరిగిన ఆర్చరీ టీమ్ ఈవెంట్లోనూ చాంగ్ అండ్ కో బంగారు పతకం గెలుచుకుంది. ఈ విజయం కోసం చాంగ్ తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. ఆర్చరీ అంటే దక్షిణ కొరియాలో క్రేజ్ ఎక్కువ. ఆర్చర్లను జాతీయ హీరోలుగా గుర్తిస్తారు. ఇందుకోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేసిన చాంగ్‌కు లండన్ ఒలింపిక్స్ ఎంపికలో స్థానం దక్కలేదు.

దీనికితోడు జాతీయ ఆర్చర్లతో కలిసి ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం కూడా ఇవ్వలేదు. అధికారిక ట్రైనర్ కూడా లేడు. అయినా ఏకలవ్యుడిలాగా తనొక్కతే ప్రాక్టీస్ చేసింది. ఏకలవ్యుడిలా పట్టుదలతో ప్రయత్నించి రియోలో ఆమె స్థానం దక్కించుకుంది. ఈ కసితోనే వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో బంగారు పతకాలు గెలిచి వాహ్వా అనిపించింది.

 

మరిన్ని వార్తలు