భారత్ ‘ఎ’ బోనస్ విజయం

23 Jul, 2014 01:01 IST|Sakshi
భారత్ ‘ఎ’ బోనస్ విజయం

రాణించిన తివారి, పాండే
 డార్విన్: నాలుగు జట్ల వన్డే టోర్నీలో భారత్ ‘ఎ’కు తొలి విజయం దక్కింది. ఆదివారం ఆస్ట్రేలియా ‘ఎ’ చేతిలో పరాజయం పాలైన భారత్... మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ‘ఎ’ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీ స్కోరు సాధించింది.
 
 మనోజ్ తివారి (73 బంతుల్లో 93; 9 ఫోర్లు, 1 సిక్స్), మనీశ్ పాండే (108 బంతుల్లో 91; 7 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీలు కోల్పోగా, ఉన్ముక్త్ చంద్ (62 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మర్చంట్ డి లాంజ్‌కు 5 వికెట్లు దక్కాయి. అనంతరం దక్షిణాఫ్రికా 47.1 ఓవర్లలో 256 పరుగులకే ఆలౌటైంది. హెండ్రిక్స్ (68 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ ఆంటాంగ్ (40 బంతుల్లో 48; 5 ఫోర్లు) మినహా ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. ధావల్ కులకర్ణి (5/54) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. భారీ తేడాతో గెలిచిన భారత్‌కు బోనస్ పాయింట్ కూడా లభించింది.
 

మరిన్ని వార్తలు