ధోనితో గొంతు కలిపిన క్లార్క్

30 Mar, 2015 19:55 IST|Sakshi
ధోనితో గొంతు కలిపిన క్లార్క్

మెల్ బోర్న్: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ గళం కలిపాడు. వన్డేల్లో ప్రస్తుతమున్న 'నలుగురు ఫీల్డర్ల' నిబంధన మార్చాలన్న ధోని అభిప్రాయంతో క్లార్క్ ఏకీభవించాడు. అతడు కూడా ఇదేరకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లు ఉంటే బాగుంటుందని, ఫలితంగా బౌలర్లకు మరింత మేలు జరుగుతుందని అన్నాడు.

వన్డేలకు గుడ్ బై చెప్పిన క్లార్క్ చివరిసారిగా స్వదేశంలో ఆసీస్ జట్టుకు వరల్డ్ కప్ ఫైనల్లో నాయకత్వం వహించి టైటిల్ సాధించిపెట్టాడు. సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లను ఉంచితే స్పిన్నర్లు మరింత రాణించే అవకాశముందని క్లార్క్ అభిప్రాయపడ్డాడు.  'నలుగురు ఫీల్డర్ల' నిబంధన మారిస్తే పరుగుల ప్రవాహం తగ్గుతుందని, బౌలర్లకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నాడు. ఈ నిబంధన మార్చాలని ధోని కూడా అభిప్రాయపడ్డాడు.

మరిన్ని వార్తలు