'మన పేస్ బౌలింగే కీలకం'

16 Feb, 2017 16:12 IST|Sakshi
'మన పేస్ బౌలింగే కీలకం'

సిడ్నీ: భారత్ పర్యటనలో ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే పేస్ బౌలర్లు కీలక పాత్ర పోషించాల్సి న అవసరం ఉందని ఆ దేశ దిగ్గజ క్రికెటర్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. భారత్ పై స్పష్టమైన ఆధిక్యం సాధించి వారిని వెనక్కునెట్టాలంటే పేస్ బౌలర్లు సాధ్యమైనన్ని ఎక్కువ వికెట్లు తీయక తప్పదన్నాడు.

 

'భారత్ లో పిచ్ లపై స్పిన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆసీస్ నమ్ముతుంది. కానీ తొందరగా బ్యాట్స్మన్లను పెవిలియన్ కు చేరడం కూడా ఫలితంపై ప్రభావం చూపుతుంది. ఇక్కడ మన పేస్ బౌలర్లు ఆకట్టుకుంటే భారత్ పై ఒత్తిడి పెంచవచ్చు. ఆస్ట్రేలియా సిరీస్ విజయం సాధించాలంటే స్టార్క్, హజల్ వుడ్లు ముఖ్య పాత్ర పోషించాలి. కొత్త బంతితో స్వింగ్ చేయడంతో పాటు, రివర్స్ స్వింగ్ కూడా చేయడం ఆస్ట్రేలియాకు ముఖ్యం. ఆసీస్ విజయం సాధించాలంటే ప్రతీ ఒక్కరూ తమ పాత్రను సమర్ధవంతంగా పోషించక తప్పదు'అని క్లార్క్ తెలిపాడు.

మరిన్ని వార్తలు