‘హలో.. కోహ్లిని కాపీ కొట్టకు’

23 Sep, 2019 20:55 IST|Sakshi

కెరీర్‌ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పాక్‌ క్రికెటర్‌ మహ్మద్‌ హఫీజ్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని కాపీ కొట్టడం అంటే అతడిలా ఫొటోలు దిగడం కాదని... కోహ్లిలా పరుగులు వరద పారించాలని కామెంట్లు చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న హఫీజ్‌ను శ్రీలంక-పాకిస్తాన్‌ సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ప్రపంచకప్‌లో కూడా చెత్త ప్రదర్శన కనబరచడంతో మేజర్‌ కాంట్రాక్టుల విషయంలో పీసీబీ అతడిని పక్కన పెట్టింది. ఈ క్రమంలో ప్రస్తుతం కరేబియన్‌ లీగ్‌లో భాగంగా హఫీజ్‌ మైదానంలో దిగాడు. సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌ తరఫున అతడు ఆడుతున్నాడు. 

ఇందులో భాగంగా తాను బస చేస్తున్న హోటల్‌లోని స్మిమ్మింగ్‌పూల్‌లో హఫీజ్ ఫొటోలు దిగాడు. సెయింట్‌ లూయీస్‌ వద్ద అందమైన సూర్యాస్తమయం అనే క్యాప్షన్‌తో వాటిని ట్విటర్‌లో షేర్‌ చేశాడు. అయితే విరాట్‌ కోహ్లి మాదిరి హఫీజ్‌ కూడా షర్ట్‌లెస్‌ ఫొటోలకు ఫోజులివ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘హలో కోహ్లిని కాపీ కొట్టాలంటే అతడి లాగా ఆటలో విజృంభించు. ఇలా ఫొటోలు కాపీ కొట్టకు. అయినా టీమ్‌ నుంచి తప్పించారన్న బాధే లేదు నీకు. పోనీ ఓ పని చెయ్‌. రిటైర్మెంట్‌ తీసుకో. హాయిగా లీగ్‌ మ్యాచ్‌లు ఆడుకుంటూ కాలం వెళ్లదీయ్’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహ్మద్‌ కైఫ్‌కు షోయబ్‌ అక్తర్‌ సవాల్‌

'సీనియర్‌ ఆటగాళ్లకు గౌరవం ఇవ్వడం లేదు'

జడేజాను ఎదుర్కొవడం కష్టం: స్మిత్‌

హాఫ్‌ కరోనా! ఇదెక్కడిది? స్పందించిన గుత్తా

గావస్కర్‌ విరాళం రూ. 59 లక్షలు

సినిమా

ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు పాజిటివ్

క్రికెట‌ర్‌ను కొట్టిన ప్రియ‌మ‌ణి..ఏమైందంటే?

బన్నీ ‘ఐకాన్‌’పై మరోసారి క్లారిటీ..

ప్ర‌భాస్‌ను చిక్కుల్లోకి నెట్టిన అభిమానులు

క‌రోనా వార్త‌ల‌పై నటి క్లారిటి

బన్ని బర్త్‌డే.. ‘నువ్వు బాగుండాలబ్బా’