'14.3 ఓవర్లలో మ్యాచ్ 'టై' అవుతుందనుకోలేదు'

26 May, 2014 11:25 IST|Sakshi
'14.3 ఓవర్లలో మ్యాచ్ 'టై' అవుతుందనుకోలేదు'
ముంబై: 14.3 ఓవర్లలో మ్యాచ్ స్కోర్లు సమానమై 'టై' కావడంలో గందరగోళం నెలకొని ఉంది అని రోహిత్ వ్యాఖ్యానించాడు. 'ప్లే ఆఫ్ కు 14 ఓవర్లా? 14.2 ఓవర్లా అనే సందేహాలు తలెత్తాయి. 14.3 ఓవర్లలో టై అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు' అని రోహిత్ అన్నాడు.  అయితే మా జట్టు విశ్లేషకులు 14 ఓవర 4వ బంతికి ఫోర్ కొడితే ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుందని వెల్లడించారు. 
 
రాయుడు రనౌట్ కావడంతో ఫాల్కనర్ బౌలింగ్ లో ఆదిత్య తారే సిక్స్ కొట్టి విజయాన్ని అందించాడు అని రోహిత్ తెలిపారు. 14 ఓవర్లలో 190 పరుగుల లక్ష్యాన్ని అధిగమించడం ఎంత కష్టమో జట్టుకు తెలుసు అని.. అయితే  మాజట్టు ఆశలను సజీవంగా నిలపడంలో సఫలమయ్యాడు అని అండర్సన్ పై రోహిత్ ప్రశంసలు కురిపించారు. 
 
నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మ్యాచ్ లో 14.3 ఓవర్లలో 190 లక్ష్యాన్ని చేరుకుంటే ప్లే ఆఫ్ కు ముంబై ఇండియన్స్ జట్టు అర్హత సాధించి క్రమంలో అండర్సన్ ఒంటి చేత్తో స్కోరును పరుగులు పెట్టించాడు. అయితే 14.3 ఓవర్లలో అంబటి రాయుడు రనౌట్ కావడంతో స్కోర్లు సమానమయ్యాయి. 
మరిన్ని వార్తలు