మా గేమ్ప్లాన్ విండీస్ కొంపముంచింది

24 Jul, 2016 14:07 IST|Sakshi
మా గేమ్ప్లాన్ విండీస్ కొంపముంచింది

తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసిన భారత్ ఆపై బౌలింగ్ లోనూ విరుచుకు పడింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 161.5 ఓవర్లలో 8 వికెట్లకు 566 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. భారత బౌలర్లు విజృంభించడంతో విండీస్ ను తొలి ఇన్నింగ్స్ లో 243 ఆలౌట్ చేసి మూడొందలకు పైచిలకు పరుగుల ఆధిక్యం సాధించి మ్యాచ్ పై పట్టు బిగించింది.

ఉమేష్ యాదవ్ (4/41), షమీ (4/66), సంచలన బౌలింగ్‌తో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌కు పట్టు దొరికింది.  గేమ్ ప్లాన్ సరిగా అమలు చేసినందునే వికెట్లు త్వరగా తీయగలిగామని ఉమేష్ పేర్కొన్నాడు. సాధ్యమైనన్ని మెయిడిన్ ఓవర్లు వేయాలని పేసర్లం నిర్ణయించుకున్నామని చెప్పాడు. దీంతో విండీస్ బ్యాట్స్ మన్ పై ఒత్తిడి పెరగడంతో పాటు వారు అసహనానికి గురై త్వరత్వరగా వికెట్లు సమర్పించుకున్నారని వెల్లడించాడు. పిచ్ చాలా స్లోగా ఉందని, కెప్టెన్ విరాట్ మా కోసం అటాకింగ్ ఫీల్డింగ్ ఏర్పాటుచేసి విండీస్ పై ఒత్తిడి పెంచామన్నాడు. గాలి తీవ్రంగా వీస్తుండటంతో 20 వికెట్లు తీయడం కష్టమని భావించామని, అయితే పక్కా గేమ్ ప్లాన్ అమలు చేసి విండీస్ ను త్వరగా ఆలౌట్ చేసి వారిని ఫాలో ఆన్ ఆడిస్తున్నామని ఉమేష్ వివరించాడు.

మరిన్ని వార్తలు