ఐపీఎల్‌–10 సీజన్‌ నుంచి వైదొలిగిన పీటర్సన్‌

3 Feb, 2017 23:43 IST|Sakshi
ఐపీఎల్‌–10 సీజన్‌ నుంచి వైదొలిగిన పీటర్సన్‌

ఇంగ్లండ్‌ సీనియర్‌ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఐపీఎల్‌ పదో సీజన్‌ నుంచి వైదొలిగాడు. ‘కొన్ని నెలలుగా ఎడతెరిపి లేకుండా క్రికెట్‌ ఆడుతూ బిజీగా ఉన్నాను.  కొన్ని రోజులు విరామం తీసుకోవాలనే ఉద్దేశంతో ఐపీఎల్‌ వేలం నుంచి నా పేరును వెనక్కి తీసుకున్నాను’ అని పీటర్సన్‌ తెలిపాడు.

36 ఏళ్ల పీటర్సన్‌ గత ఐపీఎల్‌ సీజన్‌లో పుణే సూపర్‌ జెయింట్స్‌ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడి గాయం కారణంగా మధ్యలో తప్పుకున్నాడు. ఇటీవలే బిగ్‌ బాష్‌ టి20 లీగ్‌లో పీటర్సన్‌ మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహించి 8 మ్యాచ్‌ల్లో 268 పరుగులు చేశాడు.  

whatsapp channel

మరిన్ని వార్తలు