ఫైనల్లో ప్రణీత్, ఆర్యజాదవ్

19 Aug, 2016 12:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రణీత్ రెడ్డి, ఆర్య జాదవ్ ఫైనల్లో అడుగుపెట్టారు. బోయిన్‌పల్లిలోని ఎమ్మాన్యుయేల్ టెన్నిస్ కోచింగ్ సెంటర్‌లో గురువారం జరిగిన అండర్ -14 బాలుర సెమీఫైనల్లో ప్రణీత్ రెడ్డి 6-5 (4)తో హరిహశ్వంత్‌పై గెలుపొందగా... ఆర్య జాదవ్ 6-3తో కొడకళ్ల ఆదిత్యను ఓడించాడు. బాలికల సెమీఫైనల్లో లాలస 6-0తో ఆర్ని రెడిపై విజయం సాధించగా... సోమిత 6-3తో శ్రేష్ఠపై గెలుపొందింది.


 ఇతర సెమీస్ మ్యాచ్‌ల ఫలితాలు
 
 అండర్-10 బాలురు: దర్శన్ రెడ్డి 6-4తో శౌర్యపై, శ్రీ ప్రణవ్ 6-5 (3)తో ప్రణీత్ సింగ్‌పై గెలుపొందారు.
 బాలికలు: చాందిని 6-3తో వినీలాపై, నీరాలి 6-3తో సౌమ్యపై విజయం సాధించారు.
 అండర్-12 బాలురు: వర్షిత్ కుమార్ 6-4తో లిఖిత్ రెడ్డిపై, హర్షవర్ధన్ 6-4తో అనీష్ పై పైచేయి సాధించారు.
 బాలికలు: సౌమ్య 6-3తో శ్రీహితపై, కుంకుమ్ 6-3తో ఆర్నీ రెడ్డిపై నెగ్గారు.

మరిన్ని వార్తలు