సెమీస్‌లో సింధు

25 Nov, 2016 23:32 IST|Sakshi
సెమీస్‌లో సింధు

సమీర్ వర్మ కూడా ముందుకు  క్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా
హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్

కౌలూన్: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు తన ఫామ్‌ను కొనసాగిస్తూ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. మరో టాప్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మాత్రం క్వార్టర్స్‌లో ఓడి టోర్నీనుంచి నిష్క్రమించింది. 79 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సింధు 21-17, 21-23, 21-18 స్కోరుతో గ్జియావు లియాంగ్‌పై విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌లలో సునాయాస విజయాలు సాధించిన సింధుకు క్వార్టర్స్‌లో గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్‌ను చకచకా గెల్చుకున్న సింధు, రెండో గేమ్‌లో చేజేతులా ప్రత్యర్థికి అవకాశం ఇచ్చింది. ఒక దశలో 16-12తో ఆధిక్యంలో ఉన్నా... లియాంగ్ వరుస పారుుంట్లతో దూసుకురావడంతో స్కోరు 18-18 వద్ద సమమైంది. ఆ తర్వాత 21-21కి చేరాక సింగపూర్ అమ్మారుు వరుసగా రెండు పారుుంట్లతో గేమ్ గెల్చుకుంది. మూడో గేమ్‌లో 15-15 వరకు ఇద్దరు సమఉజ్జీలుగా కనిపించినా, కీలక సమయంలో పారుుంట్లతో సింధు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

గాయంనుంచి కోలుకున్న తర్వాత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తున్న సైనాకు మరోసారి నిరాశే ఎదురైంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మూడు గేమ్‌ల పాటు పోరాడిన ఆమె ఈ సారి తలవంచింది. హాంకాంగ్‌కు చెందిన చుంగ్ గాన్ రుు 21-8, 18-21, 21-19తో సైనాను ఓడించింది.  71 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ తొలి గేమ్‌లో సైనా పేలవ ప్రదర్శన కనబర్చింది. అరుుతే కోలుకొని రెండో గేమ్ గెలుచుకోగలిగింది. మూడో గేమ్‌లో ఒక దశలో 11-18తో వెనుకబడింది. అరుుతే పుంజుకున్న సైనా వరుసగా ఏడు పారుుంట్లు కొల్లగొట్టి 18-18తో సమం చేసింది. కానీ చివరకు ప్రత్యర్థిదే పైచేరుు అరుుంది. సైనాను ఓడించి చుంగ్ గాన్‌తో సెమీస్‌లో సింధు తలపడుతుంది.

సెమీస్‌లో సమీర్ వర్మ...
పురుషుల విభాగంలోనూ భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించారుు. భారత ఆటగాడు సమీర్ వర్మ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టగా, అజయ్ జయరామ్ క్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో సమీర్ 21-17, 23-21తో ఫెంగ్ చోంగ్ వీపై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో జయరామ్ 15-21, 14-21 తేడాతో ఆంగస్ లాంగ్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు.

తొమ్మిదో ర్యాంక్‌కు సింధు
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) తాజా ర్యాంకింగ్‌‌సలో  పీవీ సింధు తొమ్మిదో ర్యాంక్‌కు చేరగా... సైనా నెహ్వాల్ టాప్-10లోంచి బయటకు వెళ్లింది. గత వారం చైనా ఓపెన్ గెలిచిన సింధు రెండు ర్యాంక్‌లు మెరుగుపరుచుకుని తొమ్మిదో స్థానానికి చేరింది. మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ ఏకంగా ఐదు స్థానాలు కోల్పోరుు 11వ ర్యాంక్‌కు చేరింది.

మరిన్ని వార్తలు