ముగిసిన రవిశాస్త్రి ఒప్పందం: ఠాకూర్

2 Apr, 2016 00:01 IST|Sakshi
ముగిసిన రవిశాస్త్రి ఒప్పందం: ఠాకూర్

త్వరలోనే భారత్‌కు కొత్త కోచ్  
ఈనెల 3 తర్వాత సీఏసీ సమావేశం

 
న్యూఢిల్లీ: భారత జట్టు డెరైక్టర్ రవిశాస్త్రితో ఉన్న ఒప్పందం ఇప్పటికైతే ముగిసిందని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అయితే శాస్త్రి ఒప్పందాన్ని పునరుద్ధరించాలా? లేదా? అన్న అంశాన్ని సచిన్, సౌరవ్, లక్ష్మణ్‌లతో కూడిన ఉన్నత స్థాయి క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) నిర్ణయిస్తుందన్నారు. ‘శాస్త్రి ఒప్పందం ముగిసింది. ఇప్పుడు పూర్తిస్థాయి కోచ్ కోసం చూస్తున్నాం. దీనిపై సీఏసీ నిర్ణయం తీసుకుంటుంది. ఇక నుంచి టీమ్ డెరైక్టర్ ఉండడు. ఒకవేళ శాస్త్రి ఒప్పందాన్ని పునరుద్ధరిస్తే పూర్తిస్థాయి కోచ్‌గానే ఉంటుంది’ అని ఠాకూర్ పేర్కొన్నారు. రవిశాస్త్రి ఒప్పందం రెండోసారి పునరుద్ధరించే అంశం పూర్తిగా సీఏసీ పరిధిలోనే ఉంటుందన్నారు. అలాగే కోచ్ పదవికి ఆసక్తిగల అభ్యర్థుల జాబితాను కూడా కమిటీ పరిశీలిస్తుందన్నారు. కొత్త కోచ్ ఎంపిక అంశంపై ఈనెల 3 తర్వాత ఏ సమయంలోనైనా కమిటీ సమావేశం అయ్యే అవకాశాలున్నాయని ఠాకూర్ వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు