సచిన్‌, కపిల్‌ సరసన జడేజా

5 Mar, 2019 18:05 IST|Sakshi

నాగ్‌పూర్‌: భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు. వన్డేల్లో రెండు వేల పరుగుల్ని సాధించడంతో పాటు 150కిపైగా వికెట్లు సాధించిన మూడో భారత క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. ఆస్ట్రేలియాతో ఇక్కడ విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో జడేజా ఈ మార్కును చేరాడు.  భారత ఇన్నింగ్స్‌లో భాగంగా మ్యాక్స్‌వెల్‌ వేసిన 41 ఓవర్‌ రెండో బంతికి పరుగు చేయడం ద్వారా వన్డే ఫార్మాట్‌లో రెండు వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. 
(ఇక్కడ చదవండి: అయ్యో.. విజయ్‌ శంకర్‌)

ఫలితంగా క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, కపిల్‌దేవ్‌ల సరసన నిలిచాడు. సచిన్‌ టెండూల్కర్‌ 18,426 వన్డే పరుగుల్ని సాధించగా, 154 వన్డే వికెట్లు సాధించాడు. ఇక కపిల్‌దేవ్‌ 3,782 వన్డే పరుగుల్ని సాధించడంతో పాటు 253 వన్డే వికెట్లు తీశాడు. ఆ తర్వాత వన్డే ఫార్మాట్‌లో రెండువేల పరుగులు, 150పైగా వికెట్లు సాధించిన భారత క్రికెటర్‌గా జడేజా నిలిచాడు. ప్రస్తుతం జడేజా ఖాతాలో 2,011 వన్డే పరుగులతో పాటు 171 వికెట్లు ఉన్నాయి. ఆసీస్‌తో మ్యాచ్‌లో భారత్‌  251 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోహ్లి(116; 120 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీకి జతగా, విజయ్‌ శంకర్‌(46; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకోవడంతో భారత జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది.  ఈ మ్యాచ్‌లో జడేజా 21 పరుగులు చేశాడు.

విరాట్‌ కోహ్లి శతక్కొట్టుడు

ఎంఎస్‌ ధోని ఐదో‘సారీ’

మరిన్ని వార్తలు