‘రియో’లో పతకమే లక్ష్యం: శ్రీకాంత్

22 Feb, 2016 01:15 IST|Sakshi
‘రియో’లో పతకమే లక్ష్యం: శ్రీకాంత్

సాక్షి, హైదరాబాద్: ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో అద్భుత ఆటతీరును కనబరిచిన భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని తెలిపాడు. సొంతగడ్డపై జరిగిన ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ పోటీల్లో శ్రీకాంత్ తాను ఆడిన నాలుగు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గెలిచాడు. భారత్‌కు కాంస్యం దక్కడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ‘ప్రపంచ ర్యాం కింగ్స్‌లో నంబర్‌వన్ కావాలంటే ఆద్యంతం నిలకడగా రాణించాలి. అలా జరిగితే ర్యాంక్ తనంతటతానే మెరుగవుతుంది. ఇప్పటికిప్పుడు టాప్ ర్యాంక్ సాధించాలని ఆరాట పడటంలేదు’ అని ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న శ్రీకాంత్ అన్నాడు. ‘అంచనాల గురించి ఎక్కువగా ఆలోచించను. కేవలం విజయం గురించే ఆలోచిస్తాను. మంచి ఫలితాలు వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తాను. రియో ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడం ఈ ఏడాది నేను పెట్టుకున్న ఏకైక లక్ష్యం’ అని శ్రీకాంత్ తెలిపాడు.

మరిన్ని వార్తలు