మొహ్మద్‌ షమీ అరుదైన ఘనత

14 Jan, 2018 14:58 IST|Sakshi

సెంచూరియన్‌:టీమిండియా పేసర్‌ మొహ్మద్‌ షమీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగవంతంగా వంద వికెట్లు సాధించిన మూడో భారత్‌ పేసర్‌గా షమీ గుర్తింపు సాధించాడు. దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో మహరాజ్‌ను అవుట్‌ చేయడం ద్వారా వందో వికెట్‌ను షమీ ఖాతాలో వేసుకున్నాడు. ఇది షమీకి 29వ టెస్టు కాగా, కపిల్‌ దేవ్‌(25 టెస్టులు), ఇర్ఫాన్‌ పఠాన్‌(28 టెస్టులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ జవగళ్‌ శ్రీనాథ్‌(30 టెస్టులు) నాల్గో స్థానంలో ఉండగా,ఇషాంత్‌ శర్మ(33 టెస్టులు) ఐదో స్థానంలోఉన్నాడు.

ఆదివారం 269/6 ఓవర్‌ నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సఫారీలు ఆదిలోనే మహరాజ్‌(18) వికెట్‌ను నష్టపోయారు. షమీ బౌలింగ్‌లో కీపర్‌ పార్థీవ్‌ పటేల్‌కు  క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. దాంతో 282 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఏడో వికెట్‌ను నష్టపోయింది. ఇక దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డు ప్లెసిస్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.తద్వారా సఫారీలు 109 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు