పోరాడి ఓడిన పీవీ సింధు

26 Apr, 2014 13:36 IST|Sakshi
పోరాడి ఓడిన పీవీ సింధు

ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ ఏషియా ఛాంపియన్షిప్లో భారత పోరు ముగిసింది. సింగిల్స్ ప్లేయర్ పీవీ సింధుతో పాటు డబుల్స్ జోడీ గుత్తా జ్వాల - అశ్వినీ పొన్నప్ప కూడా చైనా క్రీడాకారిణులతో జరిగిన సెమీస్లో ఓడిపోయారు. దీంతో 2 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ ఉన్న ఈ టోర్నమెంటులో్ కాంస్యపతకాలతోనే వారు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గంటా 18 నిమిషాల పాటు సుదీర్ఘంగా జరిగిన మారథాన్ మ్యాచ్లో వరల్డ్ నెం.2 క్రీడాకారిణి షిసియాన్ వాంగ్ చేతిలో పీవీ సింధు పోరాడి ఓడింది.

తొలి గేమ్ను సింధు 21-15 స్కోరుతో గెలుచుకుని ఆశలు రేకెత్తించింది. అయితే, రెండో గేమ్ను షిసియాన్ 22-20తో గెలుచుకుంది. మూడో గేమ్లో షిసియాన్ పూర్తి ఆధిక్యం కనబరిచింది. 21-12 తేడాతో సింధును ఓడించింది. వీళ్లిద్దరు ఇప్పటికి ఐదుసార్లు ముఖాముఖి తలపడగా సింధు మూడుసార్లు, షిసియాన్ రెండు సార్లు గెలిచారు. ఇక డబుల్స్ మ్యాచ్ మాత్రం కేవలం 33 నిమిషాల్లోనే ముగిసిపోయింది. లూ యింగ్, లూ యు జోడీ చేతిలో జ్వాల - అశ్విని జోడీ 21-12, 21-7 తేడాతో ఓడిపోయారు.

మరిన్ని వార్తలు