రషీద్‌.. జంబో సలహాలు తీసుకో

21 Jun, 2018 13:07 IST|Sakshi

భారత్‌-అఫ్గానిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన చారిత్రక టెస్టులో మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ పైనే అందరి దృష్టి ఉంది. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ చెత్త ప్రదర్శన చేశాడు. టీ20 బౌలర్ల జాబితాలో ఆగ్రస్థానంలో ఉన్న రషీద్‌ టెస్టుల్లో విఫలమవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. టెస్టుల్లో రాణించగల నైపుణ్యం రషీద్‌కు లేదని కొందరు మాజీలు విమర్శిస్తున్నారు. ఈ తరుణంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ రషీద్‌కు బాసటగా నిలిచారు.

రషీద్‌ బౌలింగ్‌లో మెరుగుపడాలంటే టీమిండియా మాజీ క్రికెటర్‌, కోచ్‌ అనిల్‌ కుంబ్లే సలహాలు తీసుకోవాల్సిందిగా సూచించారు. తరుచూ కుంబ్లేను కలిసి అలోచనలు పంచుకుంటే మరిన్ని మెళుకువలు నేర్చుకోవచ్చని ఈ మాజీ కెప్టెన్‌ సలహా ఇచ్చారు. ‘రషీద్‌ క్రికెట్‌లో మరింత మెరుగ్గా రాణించాలంటే మాజీ స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లేతో టచ్‌లో ఉండాలి. అతని నుంచి  సలహాలు, సూచనలు తీసుకోవాలి. అన్ని ఫార్మట్లలో రాణించగల సత్తా రషీద్‌కు ఉంది’ అంటూ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు రాసిస కాలమ్‌లో గంగూలీ పేర్కొన్నారు.    


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు