హైదరాబాద్‌లో సౌత్‌జోన్ జూనియర్ అథ్లెటిక్స్

7 Oct, 2014 01:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల తర్వాత హైదరాబాద్ మరోసారి సౌత్‌జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈనెల 13, 14వ తేదీల్లో జరిగే ఈ పోటీలకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా నిలువనుంది. తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం (టీఏఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో 105 అంశాల్లో, ఎనిమిది వయోపరిమితి విభాగాల్లో పోటీలుంటాయి. సౌత్‌జోన్ అథ్లెటిక్స్ మీట్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వడం ఇది నాలుగోసారి. తొలిసారిగా 1989లో, ఆ తర్వాత 2000, 2011లలో హైదరాబాద్‌లో ఈ పోటీలు జరిగాయి.

     రెండు రోజులపాటు జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అండమాన్ నికోబార్ దీవులకు చెందిన జట్టు కూడా ఈ పోటీల్లో పాల్గొనే అవకాశముందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

     హైదరాబాద్ 10కే రన్ ఫౌండేషన్ ఈ పోటీలకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఆయా రాష్ట్రాల నుంచి మొత్తం 750 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశముంది. ఆయా విభాగాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు నవంబరు 7 నుంచి 9 వరకు జార్ఖండ్‌లోని రాంచీలో జరిగే జాతీయ ఇంటర్ జోనల్ చాంపియన్‌షిప్‌లో సౌత్‌జోన్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారు.

     ఈసారి పోటీల్లో భారత్‌కు వివిధ అంతర్జాతీయ మీట్‌లలో ప్రాతినిధ్యం వహించిన పలువురు యువతారలు బరిలోకి దిగనున్నారు. మేమన్ పౌలోజ్ (కేరళ-110 మీటర్ల హర్డిల్స్; యూత్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానం); మిత్రా వరుణ్ (తమిళనాడు-డిస్కస్ త్రో; యూత్ ఒలింపిక్స్‌లో ఐదో స్థానం); నసీముద్దీన్ (కేరళ-100 మీటర్ల హర్డిల్స్; లూసోఫోనియా గేమ్స్‌లో కాంస్యం); మహ్మద్ అఫ్జల్ (కేరళ-మిడిల్ డిస్టెన్స్; ఆసియా స్కూల్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం); లేఖా ఉన్ని (కేరళ-1500 మీటర్లు; ప్రపంచ స్కూల్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం) తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

జట్టుకు కోహ్లి.. విజయాలకు ధోని!

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

వెస్టిండీస్‌కు భారీ షాక్!

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..